ఏపీలో మళ్లీ కరోనా అలజడి..ప్రభుత్వం అలెర్ట్
- December 22, 2023
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మళ్లీ అలజడి రేపుతోంది. కేరళ, ఇతర రాష్ట్రాల్లో కొత్తవేరియంట్ కేసులు నమోదవుతుండగా… రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది.ఏలూరు జిల్లాలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యుడికి కరోనా పాజిటివ్ వచ్చింది..కొత్త వేరియంట్‌పై అనుమానాలతో అతడి శాంపిల్స్ హైదరాబాద్ ల్యాబ్‌కు పంపారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరోసారి పాటించాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంల కరోనా కొత్త వేరియంట్‌పై అప్రమత్తమైంది ప్రభుత్వం..రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై నేడు సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు..వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమైన జగన్ రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. పండుగ సీజన్ కావడంతో వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి.
మరోవైపు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో తిరుపతి టీటీడీ కౌంటర్లలో కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తున్నారు..వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులతో టీటీడీ అప్రమత్తమై కౌంటర్ల దగ్గర కోవిడ్ జాగ్రత్తలపై ఫ్లెక్సీలు ఏర్పాటు..కౌంటర్ల దగ్గర నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు పెట్టారు..
కాగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని, వేరియంట్ తెలుసునేందుకు జీనోమ్ టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.
--రమ్య సాగర్ కర్రీ(మాగల్ఫ్ ప్రతినిధి,ఆంధ్ర ప్రదేశ్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష