యూఏఈలో ఘనంగా ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు

- December 23, 2023 , by Maagulf
యూఏఈలో ఘనంగా ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు

యూఏఈ: యూఏఈలో ఘనంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అభిమానులు , కార్యకర్తల మధ్య   వివిధ ప్రాంతాలలో జరిగాయి.

షార్జా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  జన్మదిన వేడుకలు యుఏఈ దేశంలోని, షార్జా లోని  కింగ్ ఫైసల్ పార్కులో ప్రముఖ సంఘ సేవకులు రిజ్వాన్ ఆధ్వర్యంలో అనేక మంది అభిమానుల సమక్షంలో ఉత్సాహంగా జరుపుకున్నారు.

అబుధాబి

అబుధాబిలోని ఐకానిక్  బిల్డింగ్  అల్ బహార్ టవర్ దగ్గర రాజేష్  బైసాని, విష్ణు, గోవర్ధన్, రాజేష్, పవన్, హరీష్  ఆధ్వర్యంలో గురువారం సాయత్రం ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.

ఆయన అభిమానులు తమ అభిమాన నాయకుడి పుట్టిన రోజును పండగలగా జరుపుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభవృద్ధి పథంలొ నడపటలో ముఖ్యమంత్రి తీసుకుంటున్న చొరవను కొనియాడారు.

దుబాయ్ 

దుబాయ్ లోని కరామా పార్క్ లో గురువారం సాయత్రం ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు శేఖర్, యాడ్రా శ్రీనివాస్, ప్రేమ్,తాడి రమేష్ , దడాలా సీత, నాగార్జున,షేక్ చిన్ని ,మజ్ను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించటానికి అవకాశం ఇచ్చిన మేడపాటి వెంకట్, ఇలియాస్ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఆయన అభిమానులు వందలాదిగా తరలివచ్చి తమ అభిమాన నాయకుడి పుట్టిన రోజును పండగలగా జరుపుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభవృద్ధి పథంలొ నడపటలో ముఖ్యమంత్రి తీసుకుంటున్న చొరవను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో యూఏఈ కన్వీనర్ సయ్యిద్ అక్రం, మరియు సభ్యులు ఇర్షాద్, చక్రి, అబ్దుల్లా , ఖాజా అబ్దుల్,ఫహీమ్, విజయ భాస్కర్ రెడ్డి , సిరాజ్ పాల్గొన్నారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ జగన్ అన్న మీద ఉన్న అభిమానం దేశాలు దాటి ఇలా విస్తరించటం చాలా సంతోషంగా ఉందని, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్ అనేక సంక్షేమ కార్యక్రమాలను వివరించి వాటిని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్ళాలి అని పిలుపునిచ్చారు.

జగన్ అన్న పాలనలో రాష్ట్రం మరింత పూరగమించాలని , ప్రజల దీవెనలతో జగన్ అన్న శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి అని వారు ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని అక్రమ్ మహిళలకు చీరతో పాటు పసుపు కుంకుమని అందించి సంక్షేమ సారధి, పెద్దల పెన్నిధి జగన్ మోహన్ రెడ్డి మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

కార్యక్రమ అనంతరం ప్రతి ఒక్కరికి విందు ఏర్పాటు చేసి ఘనంగా జన్మదిన వేడుకల్ని నిర్వహించారు.

యూఏఈలో నివసిస్తున్న ఆంధ్ర ప్రజలకి న్యాయ పరమైన లేదా ఇతర ఏ విధమైన సమస్య వచ్చిన ANRTS ప్రెసిడెంట్ మెడపాటి వెంకట్, GCC కన్వీనర్ BH ఇలియాస్ ఏళ్ల వేళల అందుబాటులో ఉంటారు అని అన్నీ విధాలుగా సహకరిస్తారని కార్యకర్తలకు మరియు అభిమానులకు అక్రమ్ తెలియచేశారు,NRI లు ప్రతి ఒక్కరు ప్రవాస ఆంధ్ర భీమా చేసుకోవాలి అని వారు ఈ సందర్భంగా కొరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com