అయోధ్య రామయ్యకు వెండి పాదుకలను సమర్పించనున్న తెలుగు వాసి..
- December 23, 2023
హైదరాబాద్: అయోధ్యలో భవ్యమైన రామమందిర ప్రారంభానికి శుభ ముహూర్తం ఆసన్నమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభ తరుణం మరికొన్ని రోజుల్లోనే రానే వచ్చింది. అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు ఉవ్విళూరుతున్నారు. ఈ క్రమంలో రామయ్యకు ఎంతోమంది భక్తులు భారీ కానుకలను సమర్పించుకుంటున్నారు. దీంట్లో భాగంగా అయోధ్య రామునికి బంగారు పూత పూసిన 9 కిలోల వెండి పాదుకలు సమర్పించేందుకు పాదయాత్ర ద్వారా బయలు దేరివెళ్లారు హైదరాబాద్‌కు చెందిన భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చల్లా శ్రీనివాస శాస్త్రి.
41 రోజులపాటు అయోధ్యలోని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి, భారత దేశవ్యాప్తంగా పాదుకలను దర్శించుకునే వీలు కల్పించాలని సంకల్పించారాయన.యూఏఈ, లండన్ దేశాలు కూడా పర్యటించి పలువురి భక్తులకు దర్శనభాగ్యం కలిగించారు. భద్రాచలం, నాసిక్, త్రయంబకేశ్వర్, చిత్రకూట్, ప్రయాగరాజ్ తదితర ప్రాంతాల మీదుగా 2 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి, సంక్రాంతి తర్వాత జనవరి 15న సమర్పిస్తానని మాగల్ఫ్ న్యూస్ కు చల్లా శ్రీనివాస శాస్త్రి తెలియజేసారు.
అయోధ్యలో రామ భక్తుల కోసం ప్రతిరోజు పదివేల లడ్డూలను ఆయన పంచిపెడుతూ తన రామభక్తిని చాటుకోనున్నారు. జనవరి 22వ తేదీన భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శ్రీరాముని సేవలో తరించనున్నారు.
జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీరాముడి భవ్య ఆలయం ప్రారంభం కాబోతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామమందిర నిర్మాణం తలపెట్టింది రామతీర్థా క్షేత్ర ట్రస్ట్. ఇందు కోసం దేశ వ్యాప్తంగా భక్తుల నుంచి విరాళాలు సేకరించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన