తెలంగాణ లో మొదటిసారి అడుగుపెట్టబోతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్
- December 24, 2023
హైదరాబాద్: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ మొదటిసారి తెలంగాణ లో అడుగుపెట్టబోతున్నారు. ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముశీతాకాల విడిది పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ నెల 27 న రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాబోతున్నారు.
ఈ నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయా లని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. ఈ మేరకు ఆమె శనివారం సెక్రటేరియెట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉపరాష్ట్రపతి రాష్ట్రానికి రావడం తొలిసారి కావడంతో పోలీస్ బందోబస్తు, పోలీస్ బ్యాండ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రత కల్పించడంతో పాటు ట్రాఫిక్, బందోబస్తుకు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని తెలిపారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







