రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ ఖేల్ ఖతమ్.!
- December 28, 2023
రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎందుకు తీస్తాడో ఆయనకే తెలీదు. కొన్ని సినిమాలు టైటిల్ అనౌన్స్ దగ్గరే ఆగిపోతాయ్. ఇంకొన్ని సినిమాలు సెట్స్ మీదికెళ్లాకా ఆగిపోతాయ్. మరికొన్ని అయితే, రిలీజ్ కాకుండానే ఆగిపోతాయ్.
తాజాగా ‘వ్యూహం’ అనే సినిమా తీశాడు. ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కావల్సి వుంది. కానీ, ఆగిపోయింది. దాంతో, అనవసరమైన ప్రేలాపనలు పేలుతూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు ఎప్పటిలాగే వర్మ.
అప్పుడెప్పుడో ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ అనే సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమా ఎన్ని వివాదాలు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే విధంగా ఇప్పుడు ‘వ్యూహం’ కూడా.
అయితే, ఈ సినిమాకి నిర్మాత వైసీపీ నేత కావడంతో, ఎన్నికలు దగ్గర చేసి, టైమ్ చూసుకుని సినిమాని రిలీజ్ చేస్తారో ఏమో అనుకుంటున్నారు కొందరు.
మరోవైపు.. కాదు ఈ ఈ సినిమా వచ్చేదీ కాదు, సచ్చేదీ కాదు.. ఓటీటీలోనో, యూట్యూబ్‌లోనో రిలీజ్ చేసుకోవాలంతే.. అంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తాడో వర్మ.!
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







