సలార్ 2’ ప్రమోషన్లు అప్పుడే మొదలయ్యాయా.?
- December 28, 2023
ఇటీవల వచ్చిన ‘సలార్’ ఓ మోస్తరుగా అంచనాల్ని అందుకున్నట్లే అని చెప్పొచ్చేమో. రిలీజ్‌కి ముందే పెద్దగా అంచనాల్లేకుండా చేసి, ప్రబాస్ ఫ్యాన్స్‌ని నిరాశలో ముంచినప్పటికీ రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యేలా చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
మొత్తానికి ‘సలార్’ హిట్‌తో సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్‌కి ‘సలార్ 2’తోనూ అటెన్షన్లో వుంచేందుకు తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నాయట.
అందులో భాగంగానే, ఈ సినిమాలోని కీలక పాత్రధారి అయిన ప్రబాస్ తండ్రి క్యారెక్టర్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తొలి పార్ట్‌లో ‘ధారా’ అనే వ్యక్తిని ప్రబాస్ తండ్రిగా పరిచయం చేసి, సైడ్ యాంగిల్లో ఆ క్యారెక్టర్ని చూపించి సస్పెన్స్ వదిలేశాడు.
దాంతో, ఆ క్యారెక్టర్లో వున్నది ఎవరా.? అని ఆరాలు మొదటయ్యాయ్. అదే రెండో పార్ట్‌పై అమితమైన ఆసక్తి కలిగించే అంశంగా మారింది. ఈ క్యారెక్టర్లో ఖచ్చితంగా ఓ పాపులర్ సీనియర్ నటుడు నటించి వుంటాడని అంచనా వేస్తున్నారు.
కొందరయితే, ఆ పాత్ర కూడా ప్రబాస్తోనే చేయించి సర్ప్రైజ్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్.. అంటున్నారు. మొత్తానికి ఏధి ఏమైతేనేం, ఎప్పుడొస్తుందో తెలియని ‘సలార్’ రెండో పార్ట్‌పై ఇప్పటి నుంచే అంచనాలయితే మొదలైపోయాయ్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..