విశ్వంభరుడికి జోడీ ఎవరబ్బా.!
- December 28, 2023
‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. అప్పుడే మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుందని సమాచారం.
అయితే, మొదటి షెడ్యూల్‌ని హీరో మెగాస్టార్ చిరంజీవి లేకుండానే చిత్రీకరించారట. సినిమాకి సంబంధించిన కీలక పాత్రల షూటింగ్ మొత్తం ఫస్ట్ షెడ్యూల్లో కానిచ్చేశారట.
ఇక, రెండో షెడ్యూల్‌కి ‘విశ్వంభర’ టీమ్ సిద్ధమవుతోంది. వచ్చే నెల నుంచి అంటే, కొత్త సంవత్సరంలో ‘విశ్వంభర’ రెండో షెడ్యూల్‌కి సన్నాహాలు జరుగుతున్నాయట.
ఈ షెడ్యూల్లో చిరంజీవి సహా హీరోయిన్ కూడా పాల్గొనే అవకాశాలున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.
అయితే, ఇంతవరకూ ఈ సినిమాకి హీరోయిన్ ఫిక్స్ కాలేదు. పలానా హీరోయిన్ అట.. అంటూ సీనియర్ ముద్దుగుమ్మలు త్రిష, నయన తార, అనుష్క తదితర హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయంతే.
కానీ, వీరిలో ఎవరు ఫిక్స్ అయ్యారన్నది ఇంతవరకూ సస్పెన్సే. కొత్త ఏడాదిలో ఖచ్చితంగా హీరోయిన్ని ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అన్నట్లు ఈ సినిమాలో ఒక్క హీరోయిన్ కాదు, ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు వుండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







