అబుధాబి: BAPS హిందూ మందిర్ ప్రారంభోత్సవం.. ప్రధానికి ఆహ్వానం
- December 28, 2023
న్యూఢిల్లీ: అబుధాబిలోని BAPS హిందూ మందిరం ప్రారంభోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు. BAPS తరఫున స్వామి ఈశ్వరచరందాస్, స్వామి బ్రహ్మవిహారిదాస్, డైరెక్టర్ల బోర్డు సభ్యులు ప్రధానిని ఆహ్వానించారు. 14 ఫిబ్రవరి 2024న జరగనున్న ప్రారంభోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు ప్రధాని అంగీకరించినట్లు ప్రతినిధులు తెలిపారు. అంతకుముందు స్వామి ఈశ్వరచరందాస్ ప్రధానమంత్రిని సత్కరించారు. ఈ సందర్భంగా ప్రపంచ సామరస్యం, అబుదాబి ఆలయ ప్రాముఖ్యత మరియు ప్రపంచ వేదికపై భారతదేశ ఆధ్యాత్మిక నాయకత్వం కోసం వారు చర్చించారు. మహంత్ స్వామి మహరాజ్ ఆరోగ్యంపై ప్రధాని ఆరా తీశారు. అబుదాబిలోని BAPS హిందూ మందిర్ ప్రాజెక్ట్‌లోని చైర్మన్ అశోక్ కొటేచా, వైస్ చైర్మన్ యోగేష్ మెహతా, డైరెక్టర్ చిరాగ్ పటేల్ లతోపాటు ఇందులో భాగస్వామ్యమైన వారందరిని అభినందించారు. స్వామి బ్రహ్మవిహారిదాస్ అబుదాబిలోని BAPS హిందూ మందిర్ వైభవాన్ని ప్రధానికి వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..