ఖతర్‌లో ఉపాధి అవకాశాలు..జనవరి 5న ఇంటర్వ్యూలు
- December 30, 2023
హైదరాబాద్:నిరుద్యోగులకు ఖతార్‌లో ఉపాధి కల్పించడానికి కంపాస్ కంపెనీ ముందుకు వచ్చింది. తెలంగాణలోని ప్రముఖ కన్సల్టెన్సీ జీటీఎం సంస్థ ఆధ్వర్యంలో జనవరి 5న నిజామాబాద్‌లో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నది. 21 ఏళ్ల వయస్సు నిండి 35 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు ఇంగ్లిష్ భాషలో పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఈసీఎన్‌ఆర్ పాస్‌పోర్టుతో పాటు ఎలాంటి పచ్చబొట్టు లేని యువకులకు ఉచిత వీసాలను జారీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జీటీఎం కన్సల్టెన్సీ కార్యాలయాల్లో తమ వివరాలను నమోదు చేయించుకోవాలి.
అయితే, ఎవరికీ ఒరిజినల్ పాస్‌పోర్టులు, డబ్బులు ఇవ్వకూడదని జీటీఎం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చీటీ సతీశ్‌రావు సూచించారు. అభ్యర్థులు ఆర్మూర్, నిజామాబాద్, జగిత్యా ల్, హైదరాబాద్‌లలో ఉన్న తమ కన్సల్టెన్సీ కార్యాలయాల్లో బయోడేటా సమర్పించి ఇంటర్వ్యూకు హాజరు కావడానికి టోకెన్ తీసుకోవాలన్నారు. కేటరింగ్ సపోర్టు సర్వీసులలో ఉపాధి కల్పించడానికి ఉచిత వీసాలను జారీ చేయనున్నట్లు ఆయన వివరించారు. గతంలో అనేకమందికి యూఏఈలో ఉపాధి కల్పించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!