ఆ కంపెనీలకు 96,000 దిర్హాంల జరిమానా!

- January 02, 2024 , by Maagulf
ఆ కంపెనీలకు 96,000 దిర్హాంల జరిమానా!

యూఏఈ: 14 నిర్దిష్ట ఆర్థిక రంగాలలో పనిచేస్తున్న 20-49 మంది ఉద్యోగులతో 12,000 కంటే ఎక్కువ కంపెనీలు ఇప్పుడు 2024లో కనీసం ఒక యూఏఈ పౌరుడిని, 2025లో మరొకరిని నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) ఇటీవల సంస్థలకు సర్క్యులర్ జారీ చేసింది.  ఆయా కంపెనీలు తమ ఎమిరేటైజేషన్ లక్ష్యాలను త్వరగా చేరుకోవాలని మోహ్రే ఆ ప్రకటనలో సూచించింది. 2024లో నియమించబడని ప్రతి యూఏఈ పౌరుడికి Dh96,000 జరిమానాలు ఈ కంపెనీలపై విధించబడతాయని హెచ్చరించింది. 2025 లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే Dh108,000 జరిమానాలు విధించబడతాయని మొహ్రే స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రోగ్రామ్ నుండి ప్రయోజనం పొందేందుకు ప్రైవేట్ కంపెనీలు నఫీస్(Nafis) ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకోవడం చాలా కీలకం అని మంత్రిత్వ శాఖ చెప్పింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com