రియాద్‌కు HQలను తరలించిన 200 సంస్థలు!
- January 02, 2024
రియాద్: సౌదీ అరేబియా రాజధాని నగరం రియాద్ కు 200 కంటే ఎక్కువ అంతర్జాతీయ కంపెనీలు తరలివచ్చాయి. ఈ సంస్థలు జనవరి 1, 2024 తర్వాత ప్రభుత్వ ఒప్పందాలను పొందాలనుకుంటే అంతర్జాతీయ కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాన్ని రాజ్యానికి మార్చాలని ఆదేశాలకు లోబడి ఆయా సంస్థల తమ కార్యాలయాలను రియాద్ కు తరలించారు. గ్లోబల్ కమర్షియల్ హబ్‌గా రియాద్ స్థానాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ విధానం ఇప్పటికే కార్పొరేట్ సంస్థల ప్రశంసలు అందుకుంటుంది. యునైటెడ్ స్టేట్స్ నుండి, నార్తర్న్ ట్రస్ట్, బెచ్‌టెల్, వైట్ & కేస్, జీఈ హెల్త్‌కేర్, పెప్సికో మరియు బేకర్ హ్యూస్ వంటి ప్రముఖ సంస్థలు తమ ప్రాంతీయ కార్యాలయాలను రియాద్ కు తరలించాయి. కార్పోరేట్ ఆదాయపు పన్నుపై 30 సంవత్సరాల మినహాయింపు, ప్రధాన కార్యాలయ కార్యకలాపాలకు సంబంధించిన విత్‌హోల్డింగ్ పన్ను, ప్రత్యేక తగ్గింపులు వంటి సమగ్ర మద్దతు సేవలలో ఆయా కంపెనీలకు రాయితీ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్‌లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







