జూన్‌ 1 నుంచి హోటల్స్‌కి మునిసిపల్‌ ఫీజు

- May 29, 2016 , by Maagulf
జూన్‌ 1 నుంచి హోటల్స్‌కి మునిసిపల్‌ ఫీజు

అబుఆబీలోని హోటల్స్‌ ఇక నుంచి మునిసిపల్‌ ఫీజ్‌ని చెల్లించవలసి ఉంటుంది. ప్రతి వినియోగదారుడి బిల్లు నుంచి నాలుగు శాతంతోపాటు రాత్రి బసకు సంబంధించి 15 దిర్హామ్‌ల అదనపు మొత్తాన్ని పీజుగా మునిసిపల్‌ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ అయ్యాయి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మునిసిపల్‌ ఎఫైర్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, టూరిజం అండ్‌ కల్చర్‌ అథారిటీ (టిసిఎ) సంయుక్తంగా ఈ ప్రకటనను విడుదల చేశాయి. అయితే రోటానా హొటల్స్‌ సంస్థ ప్రతినిథి, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాలని సూచిస్తున్నారు. అబుదాబీ బిజినెస్‌ ఫోరమ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొంత కాలంగా హాస్పిటాలిటీ రంగంలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలోనే ప్రభుత్వం ఆలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే టిసిఎ, నిర్ణీత ఫీజుల్ని వసూలు చేయాలనే నిర్ణయానికే కట్టుబడి ఉంది. త్వరలోనే ఈ ఫీజుల సేకరణకు సాంకేతిక యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేయనున్నారు. ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌కి ఈ ఫీజు 20 డాలర్లుగా ఉంటే, ఫోర్‌ స్టార్‌ హోటల్స్‌కి 15 డాలర్లు, టూ స్టార్‌, త్రీ స్టార్‌ హోటల్స్‌కి 10 మరియు, వన్‌ స్టార్‌ హోటల్స్‌కి 7 డాలర్లు ఫీజును వసూలు చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com