BIC F1 గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2024 లీడప్‌ ప్రారంభం

- January 05, 2024 , by Maagulf
BIC F1 గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2024 లీడప్‌ ప్రారంభం

బహ్రెయిన్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC) గురువారం అధికారికంగా ఫార్ములా 1 గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2024కి ఉత్తేజకరమైన లీడ్-అప్‌ను ప్రారంభించింది. ఇది F1లో బహ్రెయిన్ ల్యాండ్‌మార్క్ 20వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక చారిత్రాత్మక సందర్భం అని తెలిపారు. ఫిబ్రవరి 29 నుండి మార్చి 2 వరకు జరగనున్నది. ది అవెన్యూస్ బహ్రెయిన్‌లో BIC నిర్వహించిన అధికారిక పబ్లిక్ లాంచ్ ఈవెంట్‌లో గ్రాండ్ ప్రిక్స్ వారాంతానికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ఫాతిమా బింట్ జాఫర్ అల్ సైరాఫీ, బిఐసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్ సల్మాన్ బిన్ ఇసా అల్ ఖలీఫా, గల్ఫ్ ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెప్టెన్ వలీద్ అల్ అలావి పాల్గొన్నారు.   

బహ్రెయిన్ యొక్క పర్యాటక రంగంపై F1 యొక్క అద్భుతమైన ప్రభావాన్ని పర్యాటక మంత్రి ప్రశంసించారు. "2004 నుండి, గ్లోబల్ స్పోర్ట్స్ టూరిజం మ్యాప్‌లో మా ఉనికిని పటిష్టం చేశారు. బహ్రెయిన్‌ను మిడిల్ ఈస్ట్ మరియు వెలుపల స్పోర్ట్స్ టూరిజం కోసం ఇష్టపడే గమ్యస్థానంగా మార్చడానికి ప్రోత్సహిస్తుంది." అని ఆమె చెప్పారు. ఫార్ములా 1 ఈవెంట్ హోస్టింగ్ బహ్రెయిన్ యొక్క ఎకనామిక్ విజన్ 2030 యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. తమ పర్యాటక రంగంపై F1 ప్రభావం చూపుతుందన్నారు. 2022లో అన్ని రేస్ రోజులలో 98,000 మంది, 2023లో ఈ సంఖ్య 99,500 కు పెరిగిందన్నారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com