‘హనుమ్యాన్’ని అస్సలు పట్టించుకోరేం.!
- January 05, 2024
తెలుగు సినీ ప్రేక్షకులకు సంక్రాంతి పెద్ద పండగ. ఈ సీజన్లో ఎన్ని సినిమాలొచ్చినా నిలదొక్కుకుంటాయ్. ఆ నేపథ్యంలోనే ఈ ఏడాది సంక్రాంతికి ఐదు సినిమాలు పోటీ పడుతున్నాయ్. పెద్ద సినిమాలతో పాటూ, చిన్న హీరో అయిన తేజ సజ్జా ఈ రేస్‌లో గట్టిగా నిలబడడం విశేషం.
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ‘హనుమ్యాన్’ సినిమాని ప్యాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం వున్న దృష్ట్యా.. ఎలాగైనా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ గట్టిగా పట్టుపట్టి కూర్చుంది.
అయితే, టాలీవుడ్ సినిమా అయిన ఈ సినిమాకి టాలీవుడ్ పెద్దలే అడ్డంకిగా మారారు. రేస్‌లో వున్న అన్ని సినిమాలకీ ధియేటర్ల పంపకం జరిగింది. కానీ, ‘హనుమ్యాన్’ సినిమాకి ధియేటర్లు ఇవ్వడం కష్టం అంటున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు చెప్పడం మరీ ఆశ్చర్యకరం. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా.. ధియేటర్ల పంపకం జరగాలి సంక్రాంతి సీజన్లో.
అలాంటిది ‘హనుమ్యాన్’.. హీరో చిన్నోడే కావచ్చు.. కానీ, పెద్ద స్కేలున్న సినిమా ఇది. అలాంటిది ఈ సినిమాకి ధియేటర్లు ఇవ్వడంపై పునరాలోచన చేయాలి అని వ్యాఖ్యానించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతికి బాగా ఆడదగ్గ కంటెంట్ వున్న సినిమాగా తోస్తోంది ‘హనుమ్యాన్’. అలాంటి సినిమాని తొక్కేయాలని చూడడం నిజంగా ఇండస్ర్టీకి అవమానకరం అని కొందరి వాదన. చూడాలి మరి, ఏం చేస్తారో.!
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్‌నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









