GCC మహిళా విద్యార్థుల కోసం SQU సైన్స్ ఫోరం

- January 06, 2024 , by Maagulf
GCC మహిళా విద్యార్థుల కోసం SQU సైన్స్ ఫోరం

మస్కట్: సుల్తాన్ ఖుబూస్ యూనివర్సిటీ (SQU) జనవరి 7 నుండి నాల్గవ సైన్స్ అండ్ కల్చర్ ఫోరమ్‌ను నిర్వహించనుంది. ఈ మేరకు విశ్వవిద్యాలయ ప్రతినిధి తెలిపారు. 16 విశ్వవిద్యాలయాల నుండి 182 మంది విద్యార్థినీ విద్యార్థులు మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. GCC ప్రాంతంలోని మహిళా విద్యార్థులకు మంచి భవిష్యత్తును నిర్మించడానికి GCC దేశాలు నిర్వహిస్తున్న కార్యక్రమాల శ్రేణిలో ఇది భాగం అని వర్సిటీ వెల్లడించింది. అలాగే ఫోరమ్ మహిళా విద్యార్థులు వారి ప్రతిభను, సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఒక వేదికను కూడా అందిస్తుందన్నారు. “ఫోరమ్ GCC మహిళా విద్యార్థుల మధ్య పరస్పర గౌరవం, విలువను మెరుగుపరచడానికి కొత్త ఛానెల్‌లు సృష్టించడం ద్వారా ప్రయత్నిస్తుంది. విజ్ఞాన, సాంస్కృతిక మరియు శాస్త్రీయ అంశాలని అన్వేషించడానికి కొత్త అవకాశాలను అందించడమే కాకుండా, ఫోరమ్ అంతటా ప్రదర్శించబడే ప్రతిభ, సృజనాత్మకత మరియు వినూత్న ఆలోచనలను కూడా ఇది ప్రదర్శిస్తుంది. ఇంకా, విద్యార్థులు నాయకత్వం వంటి నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా వారి నిర్ణయాత్మక నైపుణ్యాలను మెరుగుపరచుకోగలరు.’’ అని వర్సిటీ ప్రతినిధి తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com