అయ్యో పాపం.! పూరీ హీరోయిన్‌కి అవమానం.!

- January 06, 2024 , by Maagulf
అయ్యో పాపం.! పూరీ హీరోయిన్‌కి అవమానం.!

పూరీ జగన్నాధ్ పరిచయం చేసిన హీరోయిన్లలో సమ్‌థింగ్ మ్యాజిక్ వుంటుంది. స్టార్ హీరోయిన్ల లిస్టులో పూరీ హీరోయిన్ల లిస్టు పెద్దదే కూడా. కానీ, ఎందుకో తెలీదు నేహా శర్మ మాత్రం క్లిక్ కాలేకపోయింది.

‘చిరుత’ సినిమాతో మెగా పవర్ ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ. తొలి సినిమా సూపర్ హిట్టే. అదీ మెగా కాంపౌండ్ మూవీ. కానీ, అక్కడే వుండిపోయిందెందుకో. ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు.

చెప్పుకోదగ్గ ఏముంది.. ఆ తర్వాత ‘కుర్రాడు’ అనే సినిమా చేసిందంతే.. అదేమంత హిట్టు సినిమా కాదు. దాంతో, టాలీవుడ్ ఈ పాపని మర్చిపోయింది.

మంచి డాన్సర్. మంచి స్ర్కీన్ ప్రెజెన్స్ వుంది. అన్నీ వున్నా అదేదో అన్నట్లుగా అసలుండాల్సింది లేదు. అదే లక్కు. ఇప్పుడెందుకు ఈ బ్యూటీని తలచుకున్నామా.? అంటున్నారా.?

రీసెంట్‌గా ‘హాయ్ నాన్న’ సినిమా వచ్చింది. నాని హీరోగా వచ్చిన ఈ సినిమాలో స్టార్టింగ్ కెమెరా నేహా శర్మపైనే క్లిక్ చేశారు దర్శకుడు. మోడలింగ్ నేపథ్యంలో జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయిందంతే నేహాశర్మ. స్పేస్ వుంది. చెప్పించాలంటే రెండు డైలాగులు, చేయించాలంటే మరో రెండు సీన్లు.. చేయించొచ్చు. కానీ, ఎందుకో పాపని అస్సలు వాడనే లేదు.

అలా రాక రాక ఛాన్స్ వచ్చినా యూజ్ కాలేదు నేహా శర్మకి. ఆ మాత్రం దానికి నేహా శర్మ అయితేనేం.. అడ్రస్ లేని ఏ ముద్దుగుమ్మయితేనేమి.! అని సినిమా చూసినోళ్లంతా నేహాశర్మని తలుచుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com