కొరటాల శివ పై నాగార్జున ఒత్తిడి !
- May 30, 2016
అఖిల్ వంశీ పైడి పల్లి కాంబినేషన్ లో రావలసిన మూవీ అటక ఎక్కడంతో షాక్ లో ఉన్న నాగార్జున ఇప్పుడు అఖిల్ రెండవ సినిమా విషయంలో మరింత స్పీడ్ పెంచి రకరకాల ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం దర్శకుడు హను రాఘవ పూడి అఖిల్ ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన కధను ఇష్టపడ్డ నాగార్జున ఆ కధకు సంబంధించి కొన్ని మార్పులు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఈపరిస్థితులు ఇలా ఉండగా నాగార్జున దృష్టి దర్శకుడు కొరటాల శివ పై పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ ప్రస్తుతం జూనియర్ తో తీస్తున్న 'జనతా గ్యారేజ్' సినిమా హడావిడి ఆగష్టుతో పూర్తి అవుతుంది కాబట్టి కొరటాలను ఏదో విధంగా అఖిల్ రెండవ సినిమాకు దర్శకుడిగా ఒప్పించడానికి నాగ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.ఈ నెల మలయాళంలో విడుదలయి సూపర్ హిట్ అయిన 'కమ్మటి పాదం' రీమేక్ హక్కుల పై నాగార్జున దృష్టి పడింది అని టాక్. మళయాళ దర్శకుడు రాజీవ్ రవి దర్శకత్వం వహించిన ఈసినిమా కథ ఒక సస్పెన్స్ లవ్ స్టోరీ. ఈ కథ అన్నివిధాల అఖిల్ కు బాగుంటుంది అని భావించి ఈసినిమాకు కొరటాల శివ చేత దర్శకత్వం వహింప చేయాలని నాగార్జున ఆలోచన అని అంటున్నారు.ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య చేత ఈసినిమాను కొరటాల శివ అఖిల్ కాంబినేషన్ లో రూపొందేలా నాగార్జున అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే స్వతహాగా రచయిత అయిన కొరటాల శివ ఈ రీమేక్ విషయంలో పెద్దగా ఆ శక్తి చూపిస్తాడా అన్న అనుమానాలు కూడ ఉన్నాయి. అదీ కాకుండా 'జనతా గ్యారేజ్' తరువాత మరో టాప్ యంగ్ హీరోతో సినిమాను చేయాలని కొరటాల శివ ఆలోచిస్తూ ఉంటే అతడిపై మాత్రం నాగార్జున ఒత్తిడి చాల ఎక్కువగా ఉన్నట్లు టాక్..
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







