కృష్ణా జిల్లాలో క్రికెట్ మైదానాలు ప్రారంభం..
- May 30, 2016
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో నిర్మించిన రెండు క్రికెట్ మైదానాలను బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రా, కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్లు సంయుక్తంగా ఈ మైదానాలు నిర్మించారు. విజయవాడకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఈ మైదానాలు ఏర్పాటుకావడంతో జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణపై స్థానికుల్లో ఆసక్తి నెలకొంది. జాతీయ రహదారి వెంట మూలపాటు త్రిలోచనాపురంలో 13 ఎకరాల్లో రూ.7కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని నాని, గోకరాజు గంగరాజు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ మైదానాలు ప్రారంభించిన తర్వాత అనురాగ్ ఠాకూర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కాసేపు క్రికెట్ ఆడారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







