బహ్రెయిన్ లో వైద్యులు, ఉపాధ్యాయులకు ఊరట!

- January 08, 2024 , by Maagulf
బహ్రెయిన్ లో వైద్యులు, ఉపాధ్యాయులకు ఊరట!

బహ్రెయిన్: గృహ హింసను(డొమెస్టిక్ వయలెన్స్) నివేదించడంలో విఫలమైన వైద్యులు, ఉపాధ్యాయులు మరియు గృహ కార్మికులను నేరస్థులుగా పరిగణించే ప్రతిపాదనను బహ్రెయిన్ షురా కౌన్సిల్ తిరస్కరించింది. కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా ప్రతిపాదించబడిన సవరణ ప్రకారం.. గృహ హింసను చూసినా మౌనంగా ఉన్న వారిపై జరిమానాలు, జైలు శిక్ష కూడా విధించాలని సూచించింది. అయితే, షురా కౌన్సిల్ ఈ సిఫార్సులపై సుధీర్ఘంగా చర్చించి.. చివరకు మహిళా మరియు పిల్లల వ్యవహారాల కమిటీ పక్షాన నిలిచింది. వైద్యులు, ఉపాధ్యాయులు మరియు గృహ కార్మికులను కుటుంబ వివాదంలోకి లాగే ప్రమాదం ఉందని, అలాగే  వారి వృత్తిపరమైన సరిహద్దులను చెరిపినట్టు అవుతుందని, తెలిసిన సంఘటనను నివేదించనందుకు ఎవరైనా శిక్షించడం వికృత పరిణామాలను కలిగిస్తుందని కమిటీ వాదించింది.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com