త్వరలో అయోధ్యకు హెలికాఫ్టర్ సేవలు ప్రారంభం
- January 08, 2024
న్యూఢిల్లీ : మరో రెండు వారాల్లో అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం నేపధ్యంలో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో జనవరి 22న రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుండటంతో ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పోటెత్తనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో సందర్శకులు రానుండటంతో త్వరలో హెలికాఫ్టర్ సేవలను ప్రారంభిస్తామని యూపీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ వెల్లడించారు.
జనవరి 22లోగా హెలికాఫ్టర్ సర్వీసులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. తమ శాఖ తరపున హెలికాఫ్టర్ సర్వీసులు ప్రారంభిస్తామని, అయోధ్యలో ఎయిర్‌పోర్ట్ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని మంత్రి పేర్కొన్నారు. రామాలయ ప్రారంభ వేడుకకు అయోధ్యకు తరలివచ్చే భక్తులందరికీ సకల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. అయోధ్యకు వచ్చే సందర్శకుల సంఖ్య పెరగనుండటంతో రైల్వేల సామర్ధ్యం కూడా పెంచుతామని మంత్రి వెల్లడించారు.
జనవరి 22న జరిగే రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు అధికారులు సన్నాహాలను ముమ్మరం చేశారు. ఈనెల 22న శ్రీరాముడి జన్మస్ధలమైన అయోధ్యలో నూతన రామాలయంలో శ్రీరామ విగ్రహం కొలువుతీరనుండటంతో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అతిపెద్ద చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఘట్టంగా ఆవిష్కృతం కానుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..