‘టిల్లు స్కేర్’ మరో అర్జున్ రెడ్డి అవుతుందా.?
- January 08, 2024
సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతోన్న సినిమా ‘టిల్లు స్క్వేర్’. ‘డీజె టిల్లు’ సూపర్ హిట్టవ్వడంతో, గ్యాప్ తీసుకోకుండా మనోడు ఈ సీక్వెల్ మూవీని పట్టాలెక్కించేశాడు.
అంతా బాగానే వుంది. కానీ, తొలి పార్ట్‌లో హీరోయిన్ అయిన నేహా శెట్టి.. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. సెకండ్ హీరోయిన్ కాదు.. జస్ట్ గెస్ట్ రోల్ పోషిస్తోందంతే.
అయితే, మెయిన్ లీడ్ హీరోయినిజం చూపిస్తోన్న అనుపమ పరమేశ్వరన్.. అంతకంతకూ హాట్ టాపిక్ అవుతోంది. అందుకు కారణం ఈ సినిమాలో అమ్మడు శృతి మించి అందాల ప్రదర్శన చేయడమే.
అంతేకాదు, హీరోతో ఇంటిమేట్ సిన్లలో భీభత్సంగా నటించేసిందంటూ టాక్. టాక్ ఏంటీ.? ఈ సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ఒక్కో పోస్టర్ ఆ విషయాన్ని ప్రూవ్ చేస్తూనే వుంది. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన పోస్టర్ అయితే, ఆ విషయాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లిపోయింది.
చూస్తుంటే.. ‘టిల్లు స్క్వేర్’ మరో ‘అర్జున్ రెడ్డి’ అయిపోతుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ అంటే ఒక రెస్పెక్ట్బుల్ హీరోయిన్. పర్ఫామెన్స్కి తప్ప ఎక్స్‌పోజింగ్‌కి ఎప్పుడూ ఎక్కువ స్పేస్ ఇచ్చింది లేదింతవరకూ.
కానీ, అది గతం. ఇప్పుడు ఆమె మారిపోయింది. ఏ రేంజ్ గ్లామర్ అయినా ఏ టైప్ ఆఫ్ రొమాంటిక్ సీన్లలోనైనా అలవోకగా నటించేస్తోంది మరి.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







