‘ఓజీ’ని వాళ్లు వదిలించుకున్నారు.! వీళ్లు పట్టుకున్నారు.!

- January 08, 2024 , by Maagulf
‘ఓజీ’ని వాళ్లు వదిలించుకున్నారు.! వీళ్లు పట్టుకున్నారు.!

పవన్ కళ్యాణ్‌తో సుజిత్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఓజీ’. ఈ సినిమాపై మొదటి నుంచీ అంచనాలు భారీగానే వున్నాయ్. గ్లింప్స్ రిలీజ్ చేశాకా ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయ్.
అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమానే కాదు, పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాలన్నీ ఆగిపోయాయ్.
ఈ నేపథ్యంలోనే ‘ఓజీ’ని నిర్మాతలు వదిలించేసుకోవాలనుకుంటున్నారట.. అనే కొత్త ప్రచారం తెర పైకి వచ్చింది. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య తన హోమ్ బ్యానర్‌లో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, దానయ్య చేతిలోంచి ‘ఓజీ’ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లు తీసుకున్నారట.. ఆ రకంగా డివివి దానయ్య ఈ సినిమాని వదిలించేసుకున్నారట.. అనేది ప్రచారం తాలూకు సారాంశం.
అయితే, ఈ ప్రచారంపై తాజాగా దానయ్య అండ్ టీమ్ రెస్పాండ్ అయ్యింది. ఈ ప్రచారంలో ఎంత మాత్రమూ నిజం లేదు. ‘ఓజీ సినిమా మాది.. ఎప్పటికీ అది మాదే.. మా నుంచి ఎవ్వరూ తీసుకోలేదు.. మేం వదులుకునే ప్రశక్తే లేదు..’ అని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com