హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన జగపతిబాబు
- May 30, 2016
రీ ఎంట్రీ టైంలో జగపతి బాబుకి కలిసి వచ్చినంతలా ఏవరికి కలిసి రాలేదేమో.. ఎప్పుడైతే హీరో కాస్త విలన్ అయ్యాడో అప్పటినుండి జగ్గు భాయ్ కు అదృష్టం వరించింది. తెలుగు, తమిళ, మలయాళం ఇలా అన్ని భాషల్లో జగపతిబాబు ప్రత్యేక పాత్రల్లో అదరగొట్టేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయన పనితనం గురించి హాలీవుడ్ దర్శక నిర్మతలకు కూడా తెలిసింది. అదెలా అంటే ఏకంగా స్పీల్ బర్గ్ తీసిన సినిమాలో జగపతి బాబు వాయిస్ ను తీసుకోవడం విశేషం. జగపతి బాబు వాయిస్ స్పీల్ బర్గ్ సినిమాకా అని ఆశ్చర్యపోవచ్చు.. ప్రపంచ గొప్ప దర్శకుల్లో స్పీల్ బర్గ్ ఒకరు.ఆయన తీసిన 'ది బి.ఎఫ్.జి' సినిమా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సినిమాలో 24 అడుగుల ఎత్తు ఉండే ఓ మనిషి.. పదేళ్ల చిన్నపాపతో మధ్య జరిగే కథ ఈ సినిమా. జూలై 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు 24 అడుగుల గల మనిషి వాయిస్ కు జగపతి బాబు తెలుగు, తమిళ భాషలో డబ్బింగ్ చెబుతున్నాడట. ఎంతోమందిని టెస్ట్ చేసి చూసిన ఆ క్యారక్టర్ కు జగ్గు భాయ్ వాయిస్ కరెక్ట్ మ్యాచ్ అవడంతో అతనికే ఫిక్స్ అయ్యారట. సో అలా మొత్తానికి హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు జగపతిబాబు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న బాబు స్టార్ హీరోలతో వరుసెంట సినిమాలు చేస్తున్నాడు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







