‘గుంటూరు కారం’ అంచనాలు పెరిగిపోతున్నాయ్.!
- January 10, 2024
మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ దగ్గర నుంచీ అంచనాలు రేకెత్తిస్తూనే వుంది.
ఇక, ఇప్పుడు రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ.. చిత్ర యూనిట్ చేస్తున్న సందడితో ఆ అంచనాలు మరిన్ని రెట్లవుతున్నాయ్.
తాజాగా ఈ సినిమా నుంచి వదిలిన మాస్ బీట్ సాంగ్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు, లేటెస్ట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరింత పెంచేసింది.
ఇదంతా ఇలా వుంటే, మరోవైపు ప్రీ రిలీజ్ బిజినెస్ షాకింగ్ రేంజ్‌లో జరుగుతోంది. ఫస్ట్ డే మల్టీఫ్టెక్స్‌లో 41 షోలు రికార్డు క్రియేట్ చేస్తోంది. హైద్రాబాద్‌లోని ఓ మల్టీఫ్లెక్స్‌లో ఫస్ట డే 41 షోలు ప్రదర్శించి రికార్డు సృష్టించబోతున్నారు.
మీనాక్షి చౌదరి, శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నసంగతి తెలిసిందే. త్రివిక్రమ్ మార్క్ టీజింగ్ సన్నివేశాలతో ట్రైలర్ కూడా అదిరిపోయింది.
అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ మహేష్ స్థాయిలో సూపర్బ్‌గా తెరకెక్కించాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. చూడాలి మరి, సంక్రాంతికి ‘గుంటూరు కారం’ ఘాటు ఏ రేంజ్‌లో వ్యాపించనుందో.!
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!