ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2024..

- January 10, 2024 , by Maagulf
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2024..

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2024 త్వరలో ప్రారంభం కానుంది. భారత మార్కెట్లో జనవరి 14 నుంచి రిపబ్లిక్ డే సేల్ మొదలు కానుంది. మొత్తం 6 రోజుల పాటు ఆన్‌లైన్ సేల్ కొనసాగనుంది. గత ఏడాది మాదిరిగానే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఈ సేల్ జనవరి 13న ప్రారంభమవుతుంది.

ఈ-కామర్స్ కంపెనీ రాబోయే సేల్‌లో వందలాది ఉత్పత్తులపై అద్భుతమైన డీల్స్, ఆఫర్‌లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లు, స్మార్ట్ టీవీలు వంటి ప్రొడక్టులపై డీల్‌లు, డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్‌లు లభిస్తాయి. అదనంగా, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చేసే పేమెంట్లపై ఫ్లిప్‌కార్ట్‌లో ఆదా చేసుకోవచ్చు. ఆపిల్, శాంసంగ్, గూగుల్, రియల్‌మితో సహా బ్రాండ్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లు సేల్ సమయంలో ధర తగ్గింపులను పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ఎప్పటివరకంటే? 
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ తేదీలను వెల్లడిస్తూ.. ఇ-కామర్స్ కంపెనీ ప్రత్యేక వెబ్‌పేజీని కూడా రూపొందించింది. ఈ డిస్కౌంట్ సేల్ జనవరి 14న ప్రారంభమై జనవరి 19 వరకు కొనసాగుతుంది. ప్లస్ మెంబర్‌లకు జనవరి 13 నుంచి డీల్‌లకు ముందస్తు యాక్సెస్ పొందవచ్చు. ఫ్యాషన్ అప్లియన్సెస్, టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, పరుపులపై 80 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాదు.. అప్లియన్సెస్‌పై 85 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. బ్యూటీ, టాయ్స్ వంటి వస్తువులపై 85 శాతం వరకు ధర తగ్గింపు పొందవచ్చు.

ఏయే బ్రాండ్లపై తగ్గింపులు ఉండొచ్చుంటే?
ఆపిల్, శాంసంగ్, రియల్‌మి, మోటోరోలా వంటి బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు సేల్ సమయంలో ఫోన్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లపై డీల్‌లను వెల్లడించలేదు. అయితే, ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఆపిల్ ఐఫోన్ 14, పిక్సెల్ 7ఎ డిస్కౌంట్‌లను అందుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బ్యానర్‌లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ, మోటోరోలా ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ ఎఫ్14 5జీ, రియల్‌మి సి53, రియల్‌మి 11ఎక్స్ 5జీ, మోటో జీ54 5జీ సహా మరిన్నింటిపై ఆఫర్‌లను సూచిస్తున్నాయి.

ఇంకా, ఈ సేల్ వివో ఎక్స్100 సిరీస్, ఒప్పో రెనో 11 సిరీస్, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8, రెడ్‌మి నోట్ 13 ప్రో సిరీస్, పోకో ఎక్స్6 సిరీస్‌లతో సహా కొత్త లాంచ్‌లను అందిస్తుంది. అదనంగా, క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌లు ఉంటాయి. ఈ వారం ప్రారంభంలో, ఫ్లిప్‌కార్ట్ పోటీదారు అమెజాన్ కూడా జనవరి 15 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com