విద్యార్ధుల్లో సేవాభావాన్ని పెంచేలా NATS అడుగులు

- January 11, 2024 , by Maagulf
విద్యార్ధుల్లో సేవాభావాన్ని పెంచేలా NATS అడుగులు

అమెరికా: జనవరి 10: భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. విద్యార్ధుల్లో చిన్ననాటి నుంచే సేవా భావాన్ని పెంచేందుకు ముందుడుగు వేసింది. ఫిలడెల్ఫియాలో నాట్స్ యూత్ కమిటీ  నాయకురాలు అమృత శాఖమూరి ఆధ్వర్యంలో స్థానిక ది సిబీ సౌత్ స్కూల్ యాక్టివిటీస్ కోసం విరాళాలు సేకరించారు. నాట్స్ ద్వారా సేకరించిన 6000 డాలర్ల విరాళాల చెక్కును నాట్స్ అడ్వైజరీ బోర్డు సభ్యులు శ్రీధర్ అప్పసాని, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ (ప్రోగ్రామ్స్) హరినాథ్ బుంగటావుల, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వెంకట్‌ లతో కలిసి అమృత శాఖమూరి, సీబీసౌత్ హైస్కూల్ ప్రిన్సిపాల్ జాసన్, హెచ్.బుచర్‌ కి అందించారు. నాట్స్ ఇచ్చిన విరాళం సీబీ సౌత్‌లో కార్యకలాపాలకు చాలా దోహదపడతాయని ఈ సందర్భంగా జాసన్ అన్నారు. విద్యార్ధుల్లో సేవా భావాన్ని పెంచేలా సీబీ సౌత్ కోసం నాట్స్ చేపట్టిన విరాళాల సేకరణను ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్ధుల్లో స్ఫూర్తిని నింపుతాయని ప్రశంసించారు. నాట్స్ యువవాలంటీర్లను, కొత్త తరాన్ని సేవాపథం వైపు నడిపించేందుకు ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం  చేపట్టిన ఈ డోనేషన్ డ్రైవ్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రత్యేకంగా అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com