జనవరి 12 నుండి ఆసియా కప్: దోహా మెట్రో ప్రత్యేక సన్నాహాలు
- January 11, 2024
దోహా: జనవరి 12 నుండి ప్రారంభమయ్యే AFC ఆసియా కప్ ఖతార్ 2023కి ఆతిథ్యం ఇవ్వడానికి ఖతార్ సిద్ధమవుతున్నది. ఇందు కోసం ఖతార్ రైల్ 110 ఆధునిక, సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన దోహా మెట్రో రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా రెడ్ లైన్లో 6-క్యారేజీ రైళ్లను ప్రవేశపెడతారు. ఒక్కో రైలులో 1120 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. ముఖ్యంగా మ్యాచ్ ల సమయంలో మూడు మార్గాల్లోని రైళ్ల మధ్య 3 నిమిషాల కంటే తక్కువ వ్యవధి ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. టోర్నమెంట్ వ్యవధిలో (జనవరి 12 నుండి ఫిబ్రవరి 10 వరకు) దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ సేవలు సాధారణ టైమ్‌టేబుల్ ప్రకారం పనిచేస్తాయి. శుక్రవారం (జనవరి 12 ప్రారంభ మ్యాచ్ ప్రారంభం) మినహా సేవలు మధ్యాహ్నం 2 గంటలకు బదులుగా మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభం అవుతాయి. శుక్రవారం (జనవరి 19 మరియు ఫిబ్రవరి 2) వచ్చే తర్వాతి మ్యాచ్ రోజులలో సర్వీసులు మధ్యాహ్నం 2 గంటలకు బదులుగా ఉదయం 10 గంటల నుండి మొదలవుతాయని ఖతార్ రైల్ వద్ద సర్వీస్ డెలివరీ చీఫ్ అబ్దుల్లా సైఫ్ అల్-సులైతి తెలిపారు. రద్దీకి అనుగుణంగా సర్వీసులను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఖతార్ రైల్ ప్రత్యేకంగా AFC ఆసియా కప్ ఖతార్ 2023 కోసం "స్టేడియం బై మెట్రో" పేరుతో డిజిటల్ గైడ్‌ను అభివృద్ధి చేసింది. స్టేషన్లకు సంబంధించిన సమాచారాన్ని, స్టేడియాలకు కనెక్టివిటీకి సంబంధించిన సమాచారాన్ని సులభంగా అందజేయడం దీని లక్ష్యం. రైలు సమయాలు, చివరి రైలు బయలుదేరే సమయాలు, ఏదైనా ఇతర సమాచారం లేదా విచారణల కోసం కస్టమర్లు 24/7 కస్టమర్ సేవా కేంద్రాన్ని 105 నంబర్లో కూడా సంప్రదించవచ్చని సూచించింది. అభిమానులు అన్ని స్టేషన్లలో ఉచిత వైర్లెస్ ఇంటర్నెట్ (Wi-Fi) సేవలను ఉపయోగించుకోవచ్చని, ఆహారం మరియు పానీయాల సేవలు, మినీ-మార్ట్లు, ఫార్మసీలు, క్రీడా దుస్తుల దుకాణాలు, సాంకేతికత మరియు బహుమతితో సహా వివిధ రకాల స్థానిక మరియు అంతర్జాతీయ రిటైల్ బ్రాండ్లతో అసాధారణమైన షాపింగ్‌ను అనుభవించవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు