కడుపులో మంటను అశ్రద్ధ చేస్తున్నారా.?
- January 11, 2024
కడుపులో మంట.. ఏసీడీటీ.. పేరు ఏదైనా ఈ బాధను భరించడం చాలా కష్టమే. సమస్య చిన్నదే కానీ, ఆ టైమ్‌లో కలిగే బాధ వర్ణనాతీతం. ఎవరికి వస్తే వాళ్లకే తెలుస్తుంది.
ఈ మంటను తగ్గించుకోవడానికి ఈనో తదితర మందులు అందుబాటులో వున్నప్పటికీ వీటిని రెగ్యులర్‌గా వాడడం వల్ల కడుపులో అల్సర్లు వచ్చే ప్రమాదముంది.
అందుకే సహజ సిద్ధంగానే కడుపులో మంట లేదా ఏసీడీటీ సమస్యను తగ్గించుకోవడం మంచిదని నిపుఫులు చెబుతున్నారు.
అందుకోసం ఓ చిన్న చిట్కా కూడా సూచిస్తున్నారు. జీలకర్ర ఎసీడీటీకి మంచి ఔషధం.
జీలకర్రను లైట్‌గా సన్నని మంటపై వేడి చేసి పొడి చేసి నీటిలో వేసి మరిగించి దానికి కాస్త నల్లఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే కడుపులో మంటకు చక్కని ఉపశమనం కలుగుతుంది.
అలాగే వాము, జీలకర్ర కలిపి నీటిలో వేసి మరిగించి కాస్త పసుపు, ఉప్పు చేర్చి ప్రతీరోజూ ఉదయం పరగడుపున కానీ, రాత్రి పడుకునే ముందు కానీ, తాగినా ఈ సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది.
మజ్జిగ కూడా ఏసీడీటీ సమస్యకు ఇన్‌స్టెంట్ ఉపశమనం అందిస్తుంది. అలాగే, ప్రతీరోజూ మజ్జిగ తాగడం అలవాటున్న వారిలో ఏసీడీటీ సమస్య వుండదని చెబుతుంటారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి