బ్యాంక్ ఖాతా నుండి BD2,000 చోరీ.. ఆసియన్ వ్యక్తికి జైలుశిక్ష
- January 13, 2024
బహ్రెయిన్: బహ్రెయిన్ వ్యక్తి బ్యాంక్ ఖాతా నుండి BD2,000 చోరీ చేసిన ఒక ఆసియా వ్యక్తికి విధించిన మూడు సంవత్సరాల జైలు శిక్షను అప్పీల్స్ కోర్ట్ సమర్థించింది. నిందితుడు ఒక ఫైనాన్షియల్ కంపెనీ ఉద్యోగిగా నటిస్తూ బాధితుడిని సంప్రదించాడని, అతని బ్యాంక్ ఖాతాల భద్రతను అప్డేట్ చేసే నెపంతో అతని వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి మోసం చేశాడని కోర్టు ఫైల్స్ లో పేర్కొన్నారు. కేసును విచారించిన మొదటి డిగ్రీ కోర్టు అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, BD3,000 జరిమానా, శిక్ష పూర్తయిన తర్వాత దేశం నుండి బహిష్కరణ విధించింది. నిందితుడు క్రిమినల్ గ్యాంగ్లో సభ్యుడని, బ్యాంక్ ఖాతాలను సృష్టించడం, మోసపూరిత కార్యకలాపాల నుండి మోసపూరిత మార్గంలో నిధులను చోరీ చేస్తున్నట్లు విచారణలో అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..