తబుక్‌లోని పెట్రోలు బంకులో అగ్నిప్రమాదం. ఒకరు మృతి
- January 17, 2024
రియాద్: సౌదీలోని వాయువ్య ప్రాంతంలోని టబుక్లోని ఒక పెట్రోల్ బంకులో మంగళవారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఒకరు మరణించగా.. అనేక మందికి స్వల్ప గాయాలయ్యాయి. పెట్రోల్ స్టేషన్లో చెలరేగిన మంటలను తబుక్‌లోని పౌర రక్షణ విభాగం ఆర్పివేసినట్లు సౌదీ సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయ్యాయి. తీవ్రమైన మంటలు, దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కప్పివేసాయి. సివిల్ డిఫెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడం అందులో కనిపించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి పరిశోధనలు జరుగుతున్నాయని సివిల్ డిఫెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్‌నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









