8 మంది మత్స్యకారులను రక్షించిన వ్యక్తికి సత్కారం

- January 17, 2024 , by Maagulf
8 మంది మత్స్యకారులను రక్షించిన వ్యక్తికి సత్కారం

దుబాయ్: చేపల వేటలో మునిగిపోతున్న ఎనిమిది మంది మత్స్యకారులను రక్షించిన ఎమిరాటీ నావికుడిని దుబాయ్ పోలీసులు సత్కరించారు. ఇస్సా మొహమ్మద్ అల్ ఫలాసి చేపలు పట్టేందుకు వెళుతుండగా..  ఒక వ్యక్తి అలలలో కొట్టుకుపోవడం గమనించాడు. వెంటనే రంగంలోకి దిగాడు.  ఆ వ్యక్తిని రక్షించాడు. అల్ ఫలాసి ప్రథమ చికిత్స అందించాడు. తక్షణ సహాయం అవసరమయ్యే పడవలో మరో తొమ్మిది మంది ఉన్నారని గుర్తించాడు. వారందరిని రక్షించాడు. దురదృష్టవశాత్తు, అతను వారిని చేరుకోకముందే అప్పటికే వారిలో ఇద్దరు నీటిలో మునిగిపోయారు. అనంతరం వారి మృతదేహాలను వెలికితీశారు. మత్స్యకారులను రక్షించిన ఇస్సా మొహమ్మద్ అల్ ఫలాసిని దుబాయ్ పోలీస్‌లోని కమ్యూనిటీ హ్యాపీనెస్, లాజిస్టిక్స్ అఫైర్స్ కోసం అసిస్టెంట్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ అహ్మద్ మహ్మద్ రఫీ సత్కరించారు. ఫిషింగ్ ట్రిప్‌లు లేదా విహారయాత్రలు ప్లాన్ చేసే వ్యక్తులందరూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు, భద్రతా చర్యలను తీసుకోవాలని ఆయన సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com