క్యాన్సర్ పేషెంట్లకు పుట్ట గొడుగులు ఓ వరం.! ఎందుకంటే.!
- January 18, 2024వెజిటేరియన్స్‌కి నాన్‌వెజ్ ఫుడ్‌గా పిలవబడే పుట్టగొడుగుల్లో ఎన్నో పోషకాలున్నాయ్. ప్రోటీన్లతో పాటూ విటమిన్ ఏ, బి, విటమిన్ బి 12, విటమిన్ డి తదితర విటమిన్లు. వీటిలో పుష్కలంగా లభిస్తాయ్.
ముఖ్యంగా పుట్టగొడుగుల్ని రోగనిరోధక శక్తిని పెంపొందించే సహజ సిద్ధమైన ఆహారంగా చెబుతారు. పుట్టగొడుగుల్లో బీటా గ్లూకాన్స్ అధికంగా వుంటాయ్. వీటి ఇమ్యునోమోడ్యులేటనరీ ప్రభావం కారణంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించే లక్షణాన్ని శరీరం మెరుగుపరుచుకోగలుగుతుంది.
ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు పుట్టగొడుగులు దివ్యౌషధంగా నిపుణులు చెబుతున్నారు. కీమో థెరఫీ లేదా రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకునే క్యాన్సర్ రోగుల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది.
అందుకే క్యాన్సర్ రోగులు తమ డైట్లో పుట్టగొడుగులు చేర్చుకోవడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే, కేవలం క్యాన్సర్ రోగులే కాదు, విటమిన్ డి సమస్యతో బాధపడేవారు కూడా పుట్టగొడుగుల్ని రెగ్యులర్‌గా తమ డైట్లో చేర్చుకోవడం వుత్తమమని చెబుతున్నారు. ఎందుకంటే, పుట్టగొడుగుల్లో విటమిన్ డి పుష్కలంగా వుంటుంది.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు