ప్రబాస్ - మారుతి.! అసలు కథ వేరే వుంది.!
- January 18, 2024
‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రబాస్‌తో సినిమా అంటే అది భారీ నుంచి అతి భారీ బడ్జెట్ సినిమానే. పక్కా.! కానీ, ‘బాహుబలి’ తర్వాత సినిమా బడ్జెట్‌లో వున్న భారీ తనం, రిలీజ్ తర్వాత వసూళ్లలో చూపించలేకపోయాడు ఏ సినిమాతోనూ ప్రబాస్.
రీసెంట్‌గా వచ్చిన ‘సలార్’ కూడా ఆ కోవకు చెందిందే. ఆల్రెడీ సెట్స్‌పై వున్న ‘కల్కి ఏడీ’ సినిమా కూడా అంతే. అత్యంత భారీ బడ్జెట్‌తో అశ్వనీదత్ రూపొందిస్తున్న సినిమా.
అయితే, మీడియం కాదు కాదు ఓ మోస్తరు రేంజ్ డైరెక్టర్‌గా పేరున్న మారుతి డైరెక్షన్‌లోనూ ప్రబాస్ ఓ సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే.
మారుతి సినిమాలంటే చాలా లోబడ్జెట్‌లో వుంటాయన్న సంగతి తెలిసిందే. మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు తీసి, లక్కు కలిసొచ్చి హిట్టు కొట్టిన డైరెక్టర్ మారుతి.
అలాంటి మారుతి డైరెక్షన్‌లో ప్రబాస్‌లాంటి ఓ యూనివర్సల్ హీరో సినిమా అంటే.. ప్రబాస్ ఫ్యాన్స్ అస్సలు ఒప్పలేదు. కానీ, మారుతితో సినిమా అంటే లో బడ్జెట్ సినిమా. తక్కువ ఖర్చుతో తక్కువ టైమ్‌లోనే పూర్తయిపోతుంది. మారుతి సైడ్ నుంచైనా లక్కు కలిసొచ్చిందంటే, ఆ సినిమా పెద్ద హిట్టవుతుంది.
సో, హిట్ అయ్యిందంటే ప్రబాస్ రేంజ్‌కి భారీ వసూళ్లు రావడం పక్కా. ఓ మాదిరి టాక్ సంపాదించుకున్నా.. నష్టాలుండవ్.. ఈ లెక్కల్లోనే మారుతితో సినిమాకి ప్రబాస్ ఒప్పుకున్నాడనీ ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. అదీ ఈ కాంబో కలయిక వెనకున్న చిదంబర రహస్యం.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!