తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికకు నామినేషన్ల పర్వం ..
- May 30, 2016
తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ, టీడీపీ అభ్యర్థులు, తెలంగాణ నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థులు మంగళవారం ఉదయం నామినేషన్లు దాఖలు చేశారు.ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ టీడీపీ అభ్యర్థులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన టీడీపీ అభ్యర్థులు అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. వారి వెంట లోకేశ్, మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.బీజేపీ అభ్యర్థిగా కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు బీజేపీ కార్యాలయం నుంచి నేతలతో కలిసి ఏపీ అసెంబ్లీకు చేరుకున్నారు. ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకు ముందు బీజేపీ కార్యాలయంలో నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. సురేష్ ప్రభు వెంట కేంద్రమంత్రి అశోకగజపతి రాజు, మంత్రి కామినేని, ఆంధ్రా, తెలంగాణ బీజేపీ నేతలు ఉన్నారు.టీఆర్ ఎస్ నుంచి డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు నామినేషన్లు వేసేందుకు తెలంగాణ అసెంబ్లీ కార్యాలయానికి చేరుకున్నారు. మరికాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. వారి వెంట మంత్రులు, టీఆర్ ఎస్ నేతలు ఉన్నారు. నేటి మధ్యాహ్నంతో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుంది. జూన్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3వ తేదీ గడువు ఉంది. జూన్ 11న అసెంబ్లీలో పోలింగ్ నిర్వహిస్తారు
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









