వరుణ్ తేజ్ ‘మట్కా’.! ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడుగా.!
- January 20, 2024
మెగా రాకుమారుడు వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా వున్నాడు. అందులో ఒకటి ‘ఆపరేషన్ వాలైంటైన్’ ఒకటి.. ఇంకోటి ‘మట్కా’. ఈ రెండు సినిమాలూ రెండు విభిన్న తరహాల్లో రూపొందుతున్న చిత్రాలు.
ఆపరేషన్ వాలైంటైన్ ఆర్మీ బేస్ కాన్సెప్ట్ మూవీ. కాగా, ‘మట్కా’ చిత్రం రెట్రో మూవీగా రూపొందుతోంది. తాజాగా వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
గ్లింప్స్‌లో వరుణ్ తేజ్ అప్పియరెన్స్ పెద్దగా కనిపించలేదు.. కానీ, షాడోలా బ్యాక్ గ్రౌండ్‌లో చూపించారు. అయితే, సమ్‌థింగ్ డిఫరెంట్‌గా అనిపిస్తోంది గ్లింప్స్ చూస్తుంటే.
భార్గవ్ కృష్ణమాచారి అనే కొత్త దర్శకుడు సరికొత్తగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాలో నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది ఈ సినిమాలతో కొత్త పెళ్లికొడుకు వరుణ్ తేజ్ ఎలాంటి సంచలనాలు అందుకుంటాడో చూడాలి మరి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







