బీరకాయతో ఇన్ని లాభాలా.?
- January 20, 2024
కూరగాయల్లో బీరకాయది ప్రత్యేకమైన స్థానం. బీరకాయను తొక్కతో సహా వంటలో ఉపయోగిస్తుంటారు.
తొక్కను పచ్చడిగా, కొన్ని రకాల స్నాక్స్ తయారీలో అలాగే, స్వీట్స్ తయారీలోనూ దోస వంటి బ్రేక్ ఫాస్ట్ తయారీలోనూ వాడుతుంటారు.
సర్జరీల టైమ్‌లో ప్రత్యేకమైన పత్యం కూరగాయగా కూడా బీరకాయను వాడుతుంటారు. అయితే, బీరకాయకు ఎందుకింత ప్రత్యేకత.. అసలు బీరకాయలో వుండే ఆరోగ్య ప్రయోజనాలేంటీ.? తెలుసుకుందాం.
బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ. శరీరానికి హాని చేసే కొవ్వు పదార్ధాలు ఇందులో చాలా తక్కువ పాళ్లలో వుంటాయ్. మంచి చేసే ఫైబర్ చాలా ఎక్కువగా వుంటుంది.
అలాగే, మెగ్నీషియం, కాల్షియం వంటి మూలకాలు ఎక్కువగా వుంటాయ్. రోగ నిరోదక శక్తిని పెంచే గుణం బీరకాయకు చాలా ఎక్కువ.
కేలరీలు తక్కువగా వుండడం వల్ల శరీర బరువు తగ్గడంలో బీరకాయ వుపయోగపడుతుంది. తద్వారా రక్తపోటు సమస్య దరి చేరదు. అంతే కాదు, గుండె సంబంధిత సమస్యలను సైతం దరి చేరనివ్వదు.
డయాబెటిస్ వున్న వాళ్లకు బీరకాయ దివ్యౌషధంగా చెబుతారు. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుండడం వల్ల మలబద్ధకం సమస్య వున్నవాళ్లు బీరకాయను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!