ట్రావెల్ సంస్థ మోసాలపై 'లక్కీ డ్రా విజేతలు' ఫైర్!

- January 23, 2024 , by Maagulf
ట్రావెల్ సంస్థ మోసాలపై \'లక్కీ డ్రా విజేతలు\' ఫైర్!

యూఏఈ: దుబాయ్ నివాసి స్నేహ, ఆమె కుమారుడు అపోలో టైమ్స్ ట్రావెల్ నుండి ఉచిత బహుమతి గెలిచారంటూ కాల్ అందుకున్నారు. సంతోషంతో బహుమతిని క్లెయిమ్ చేయాలని అపోలో కార్యాలయాన్ని సందర్శించారు. అల్ రెయామి బిల్డింగ్‌లోని రెండవ అంతస్తు కార్యాలయానికి చేరుకున్న ఓ టైమ్-షేర్ ప్యాకేజీపై సంతకాలు చేయాల్సి వచ్చింది. Dh40,000 ధరతో ఎనిమిది మంది కుటుంబ సభ్యులు అమెరికాలో పర్యటించేందుకు ఉద్దేశించిన ప్లాటినమ్ ప్యాకేజీని విని ఆలోచించక స్నేహ వెంటనే సైన్ అప్ చేసింది. ఇదే విధమైన ట్రావెల్ సంస్థల వ్యూహాలు శివనాగరాజు మరియు అతని భార్య సౌమ్య ఎదుర్కొన్నారు. వీరు గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రపంచ పర్యటన వాగ్దానంతో బంగారు సభ్యత్వం కోసం Dh28,000 పెట్టుబడి పెట్టారు. గత శనివారం శివనాగరాజా, స్నేహ మరియు అనేకమంది ఇతర యూఏఈ నివాసితులు ఇప్పటికీ అమలు కాని పర్యటనల గురించి తెలుసునేందుకు అపోలో కార్యాలయాన్ని సందర్శించారు. కానీ అప్పటికే ఆ కంపెనీని మూసివేసారు. దాని యజమానులు, సిబ్బంది అడ్రస్ లేకుండా పారిపోయారు. దీంతో మోసానికి గురైన బాధితులు తమ అనుభవాలను వివరించారు.  ఒక మిలియన్ దిర్హామ్‌లకు మించి నష్టపోయినట్లు వెల్లడించారు. వీరిలో దీపేష్ (41,000), మోహిత్ రాజ్‌పాల్ (28,000), అరూప్ దత్తా (25,000), కె. శ్రీనివాసన్ (20,000), అభిలాష్ నెచిమత్తహిల్ (16,000), పూజా శ్రీకాంత్ పాలన్ (15,100) , అంబరసు శివమణి (Dh15,500), వికాస్ సింగ్ (Dh15,000), రజనీ చంద్రన్ (Dh9,000) ఆర్థికంగా మోసపోయినట్లు తెలిపారు. దీపేష్‌కు యూరప్, పాలన్‌కు సింగపూర్, మలేషియా.. మోహిత్‌కు ఆస్ట్రేలియా, వికాస్‌కు యూరప్‌కు తీసుకెళతామని హామీ ఇచ్చారు. సచిన్ కుమార్ ఇటీవల జనవరి 7న జార్జియా మరియు అర్మేనియా పర్యటనల కోసం Dh6,000 చెల్లించారు. మక్కాకు తీర్థయాత్ర కోసం 14,000 దిర్హామ్‌లు చెల్లించినట్లు ముబారక్ దస్తగిర్ గవాండి వాపోయారు. తాము గతంలో సంప్రదించిన సమయంలో కంపెనీ వారు ట్రిప్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ స్లాట్‌లు అందుబాటులో లేవని, వేచి ఉండాల్సి వస్తోందని చెప్పినట్లు బాధితులు తెలిపారు. హోటల్‌లు అందుబాటులో లేకపోవడం నుండి ముందస్తు నోటీసు లేకపోవడం వరకు సాకులు చెప్పారని వాపోయారు. మరోవైపు బాధితులు కోర్టులో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దుబాయ్ పోలీసులు సిఫార్సు చేశారు. కానీ కోర్టు ఖర్చుల కారణంగా చాలా మంది వెనుకాడుతున్నారు. బంగారు ప్యాకేజీని ఎంచుకున్న దాస్ మాట్లాడుతూ.. తాము కోర్టు నుంచి అనుకూలమైన తీర్పును పొందినప్పటికీ, ఈ మోసానికి బాధ్యులు ఇప్పటికే పరారీలో ఉన్నారని, మాకు ఎవరు తిరిగి చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నాడు. భారతీయ యజమానుల యాజమాన్యంలోని అపోలో టైమ్స్ అండ్ ట్రావెల్స్ తన వాణిజ్య లైసెన్స్ గడువు డిసెంబర్ 11, 2023లో ముగిసింది. టైమ్‌షేర్ స్కామ్‌లు ఇటీవలి సంవత్సరాలలో పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 2023లో రాయల్ రెగిస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బోర్డు తిప్పేసిందని, వందల మంది బాధితులు నష్టపోయారని గుర్తుచేశారు. సదరు కంపెనీ హాఫ్ మిలియన్ దిర్హామ్‌ల విలువైన హాలిడే ప్యాకేజీలను విక్రయించి మోసాలకు పాల్పడింది. అంతకుముందు అరేబియన్ టైమ్స్ ట్రావెల్ & టూరిజం ఇదే తరహాలో సుమారు 200 మందిని మోసం చేసింది. స్కామ్‌లు సాధారణంగా ఊహించని ఫోన్ కాల్‌లతో గిఫ్ట్ హ్యాంపర్‌లను అందిస్తాయని, టైమ్-షేర్ ప్యాకేజీల కోసం చాలా మంది నివాసితులను కంపెనీలు ఒప్పుకునేలా 'అమ్మకం' వ్యూహాలను కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com