హెమోగ్లోబిన్ లోపాన్ని సులువుగా గుర్తించడం ఎలా.?
- January 23, 2024ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా హెమోగ్లోబిన్ లోపం కనిపిస్తుంటుంది. హెమోగ్లోబిన్ లోపం కారణంగా తీవ్రమైన అలసట, నీరసం వేధిస్తుంటాయ్.
అలాగే, చిన్న చిన్న విషయాలకే కోపం రావడం.. చికాకు నిస్సత్తువ వంటి లక్షణాలు చూడొచ్చు. హెమోగ్లోబిన్ లోపాన్ని అస్సలు అశ్రద్ధ చేయరాదని నిపుణులు చెబుతున్నారు.
తరచూ చేతులూ, కాళ్లు చల్లగా మారడం.. చిన్న చిన్న విషయాలకే భయం.. గుండె దడ, అతివేగంగా గుండె కొట్టుకుంటున్నట్లుగా అనిపించడం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయ్.
ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంటుంది. సఫొకేషన్తో బాధపడుతుంటారు. ఎక్కువగా నిలబడినా.. నడిచినా కళ్లు తిరుగుతుంటాయ్.
ఈ లక్షణాలుంటే.. హెమోగ్లోబిన్ సమస్య వున్నట్లు ప్రాధమికంగా గుర్తించొచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యుని సంప్రదించాలి.
వైద్యులు సూచించిన మందులు వాడుతూనే డైట్లోనూ చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. పాలకూర, క్యారెట్, బీట్ రూట్ వంటివి ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవాలి. బాదం, పిస్తా, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ కూడా అధికంగా తినాలి.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం….17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు