విశ్వ హిందీ పరిషత్తు సమన్వయకర్తగా అచార్య యార్లగడ్డ
- January 23, 2024
విశాఖపట్నం: పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. హిందీ భాషాభివృద్ది కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న విశ్వ హిందీ పరిషత్, అచార్య యార్లగడ్డను అమెరికా, కెనాడా దేశాలకు హిందీ భాషా సమన్వయకర్తగా నియమించింది. అక్కడి ఔత్సాహికులకు యార్లగడ్డ హిందీ నేర్చుకోవటంలో ప్రత్యేక తర్ఫీదును ఇస్తారు. నెలరోజుల తరువాత కెనడా చేరుకుని అక్కడ కూడా హిందీ అధ్యయనానికి అవసరమైన చర్యలను పర్యవేక్షిస్తారు. ఈ నేపథ్యంలో విశ్వ హిందీ పరిషత్తు నేతృత్వంలో సంయోజకుడు విపన్ కుమార్ మంగళవారం అచార్య యార్లగడ్డకు డిల్లీలో స్వాగతం పలికి మెమొంటో, శాలువాతో సత్కరించారు. ఈ క్రమంలో యార్లగడ్డ మంగళవారం అమెరికా బయలు దేరి వెళ్లారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







