నడకతోనూ మధుమేహానికి చెక్ పెట్టేయొచ్చా.?
- January 24, 2024మధుమేహం ఒక్కసారి వచ్చిందంటే చాలు.. జీవితాంతం దాంతో సహజీవనం చేయాల్సిందే. అయితే, మందులు వాడుతూనే డైట్ ఒకింత.. దినచర్యలోని కొన్ని మార్పులు ఇంకొంత.. ఇలా ఓ పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తే మధుమేహం వున్నా హాయిగా జీవించేయొచ్చు.
డైట్ సంగతి అటుంచితే, నడక అనేది చాలా చాలా దీర్ఘకాలిక వ్యాధులకు దివ్యౌషధంగా చెప్పొచ్చు. అలాగే, మధుమేహులకు కూడా నడక ఓ వరమే.
అయితే, మధుమేహం వున్న వారు ఓ పర్టిక్యులర్ వేగంతో ప్రతీరోజూ వాకింగ్ చేస్తే ఆ ఫలితాలు మరోలా వుంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గంటకు 4 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో నడిస్తే.. మధుమేహం అదుపులో వుంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఒకవేళ మధుమేహం లేని వాళ్లకయితే, ఇదే నడక తీరును ఫాలో చేస్తే.. భవిష్యత్తులో మధుమేహం బారిన పడే అవకాశాలు కూడా చాలా చాలా తక్కువని ఓ సర్వేలో తాజాగా తేలింది.
అంతేకాదు, ఈ వేగాన్ని గ్రాడ్యుయల్‌గా పెంచుకుంటూ పోతే.. ఇంకా మంచి ఫలితాలు చూడొచ్చట. గంటకు 5 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో నడవడం వల్ల డయాబెటిస్ ముప్పు నుంచి తపించుకునే అవకాశం మరో 15 శాతం పెరుగుతుందట. అయితే శరీర సామర్ధ్యాన్ని కూడా దృస్టిలో పెట్టుకుని ఈ నడక వేగాన్ని ఫాలో చేయాలని నిపుణుల హెచ్చరిక.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు