రాస్ జువేద్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ప్రజలు, వ్యాపారులు బేజారు!
- January 25, 2024
బహ్రెయిన్: రాస్ జువేద్లోని వ్యాపారులు, నివాసితులు అక్రమ వీధి హాకింగ్, జూదం మరియు భిక్షాటన వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే ఈ ప్రాంతానికి తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వారాంతంలో ఇటువంటి కార్యకలాపాల పెరుగుదల ఎక్కువగా కనిపిస్తుందన్నారు. సదరన్ గవర్నరేట్‌లోని రాస్ జువేద్ అక్రమ వీధి విక్రయాల సమస్యతో పోరాడుతున్నారు. ఇందులో కూరగాయలు, పండ్లు, మాంసం మరియు దుస్తులు వంటి వివిధ వస్తువులు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న నిబంధనలను ఉల్లంఘిస్తూ అపరిశుభ్ర పరిస్థితుల్లో ఈ సరుకులు విక్రయిస్తున్నారు. విక్రేతల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సమస్య తీవ్రమవుతుందని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు ఈ పరిస్థితులు యాచకుల సంఖ్యను, జూదం వంటి నేర ప్రవర్తనలను ప్రోత్సహిస్తుందన్నారు. బహ్రెయిన్‌లో చట్టవిరుద్ధమైన వీధి విక్రయాలు, యాచించడం మరియు ఆన్లైన్ జూదం నిషేధించబడింది. రాజ్యంలో జూదానికి సంబంధించిన కార్యకలాపాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇప్పటికే కఠినమైన చర్యలను అమలు చేస్తుంది.
లైసెన్స్ లేని వీధి విక్రేతలు చట్టబద్ధంగా లైసెన్స్ పొందిన సూపర్ మార్కెట్లు, ప్రభుత్వ రుసుములన్నీ చెల్లించిన తర్వాత నిర్వహించే చిన్న దుకాణాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తారని రాస్ జువేద్లోని కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్న ఒక మహిళ పేర్కొంది. ఈ అక్రమ విక్రయదారులు నిర్భయంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తే.. చట్టబద్ధంగా నిర్వహించబడుతున్న తమ వ్యాపారాలు నష్టాల్లో కూరుకుపోయి, మూసివేయవలసి వస్తుందన్నారు. ఇప్పటికే వీధి విక్రయదారులపై తవాసుల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు వ్యాపార యజమానులు, పౌరులు వెల్లడించారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలోని అక్రమ వ్యాపారులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే, పోలీసులు మరియు ఇతర అధికారులు వెళ్లిన వెంటనే తిరిగి భిక్షాటన, జూదంతో సహా అన్ని చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు మొదలవుతున్నాయని నివాసితులు చెబుతున్నారు. LMRA, లేబర్ మినిస్ట్రీ మరియు ఇంటీరియర్ మినిస్ట్రీ వీలైనంత త్వరగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠినమైన జరిమానాలు విధించాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్‌లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









