ఆస్ట్రేలియా బీచ్‌లో నీట మునిగి నలుగురు భారతీయులు మృతి
- January 25, 2024
ఆస్ట్రేలియా బీచ్‌లో నీట మునిగి నలుగురు భారతీయులు మృతి
మెల్బోర్న్: ఆస్ట్రేలియా లో బీచ్‌కు వెళ్లిన నలుగురు భారతీయులు నిటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్‌కు చెందిన బీచ్ వద్ద బుధవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగిపోతున్న నలుగురిని గుర్తించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ముగ్గరు మరణించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మరొకరిని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు హహిళలు. ఈ ఘటనపై కాన్‌బెర్రాలోని భారత హై కమిషన్ స్పందించింది. ఘటనకు గానూ విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలియజేసింది.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







