షార్జా అగ్నిప్రమాదంలో తండ్రి, కూతురు మృతి

- January 26, 2024 , by Maagulf
షార్జా అగ్నిప్రమాదంలో తండ్రి, కూతురు మృతి

యూఏఈ: షార్జాలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో పాకిస్థాన్ జాతీయుడు, అతని కుమార్తె మరణించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మృతిచెందిన ఇమ్రాన్ ఖాన్ మరియు అతని కుటుంబం షార్జాలో నివసిస్తున్నారని యూఏఈలోని పాకిస్తాన్ రాయబారి ఫైసల్ తిర్మిజీ చెప్పారు. ఖాన్ భార్య,  ఇద్దరు పిల్లలు షార్జాలోని అల్ ఖాసిమి హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నారు. "జనవరి 25న ఉదయం షార్జాలో ఉన్న ఒక పాకిస్తానీ ఇంట్లో దురదృష్టకర ప్రమాదం జరిగింది. ఇందులో కుటుంబ పెద్ద ఇమ్రాన్ ఖాన్, అతని ఒక కుమార్తె ఈ సంఘటనలో మరణించారు. అతని భార్య మరియు ఇద్దరు పిల్లలు అల్ ఖాసిమి హాస్పిటల్ ICUలో చికిత్స పొందుతున్నారు.  ”అని రాయబారి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com