సినిమానా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ప్రారంభం

- January 29, 2024 , by Maagulf
సినిమానా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ప్రారంభం

ఖాసబ్: సినిమానా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 5వ ఎడిషన్ ఆదివారం ఖాసబ్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్ లో ప్రారంభమైంది. సాంస్కృతిక, క్రీడలు మరియు యూత్ ఫర్ కల్చర్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ సయ్యద్ సయీద్ బిన్ సుల్తాన్ అల్ బుసైదీ ఆధ్వర్యంలో ముసండం గవర్నరేట్ గవర్నర్ కార్యాలయం, అనేక ప్రభుత్వ శాఖలు మరియు ప్రైవేట్ రంగ సంస్థలు ఈ ఫెస్టివల్ లో పాల్గొంటున్నాయి. సినిమానా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ పండుగతో పాటు జరిగే కార్యకలాపాలు మరియు కార్యక్రమాల ద్వారా సాంస్కృతిక, పర్యాటక మరియు ఆర్థిక అంశాలపై ఫోకస్ చేశాయి. సినిమా సంస్కృతిని, చిత్ర పరిశ్రమ రంగంలో యువ ప్రతిభను గుర్తించడం , వినూత్న కంటెంట్‌ను ప్రోత్సహించడం మరియు అభివృద్ధి చేయడం కూడా దీని లక్ష్యమని వక్తలు తెలిపారు. ప్రారంభ వేడుకలో ఆరు డాక్యుమెంటరీ ఫిల్మ్‌లు, పదకొండు లఘు డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ఓమనీ చిత్ర దర్శకుడు సుల్తాన్ అల్ అహ్మద్ రూపొందించిన ‘ఎ టేల్ ఆఫ్ ఎ కాజిల్’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఒమానీ కళాకారులు, అరబ్ అతిథులు, ఈవెంట్‌ను స్పాన్సర్ చేసిన ప్రభుత్వ - ప్రైవేట్ సంస్థలను సత్కరించారు.  సినిమానా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ చైర్మన్ డాక్టర్ ఖలీద్ బిన్ అబ్దుల్రహీమ్ అల్ జడ్జాలీ ఈ బృందానికి అధ్యక్షత వహిస్తున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com