‘విశ్వంభర’ డేట్ ఫిక్స్ చేశారు కానీ.!
- January 29, 2024‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘విశ్వంభర’ అని ఇంతవరకూ ప్రచారంలో వున్న టైటిల్‌నే ఫిక్స్ చేశారు.
వచ్చే ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ వుండబోతోందని మేకర్లు ప్రకటించారు. తాజాగా సినిమా రిలీజ్ డేట్ కూడా తెర పైకి వచ్చింది. మొదట్లో అనుకున్నట్లే సంక్రాంతి టార్గెట్‌గా ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారనీ తెలుస్తోంది.
జనవరి 10న ‘విశ్వంభర’ ధియేటర్లలో సందడి చేయనుందట. అయితే, ఏడాదికి ముందు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు సరిగ్గా ఆ టైమ్‌కి వచ్చేసరికి ఎలాంటి పరిస్థితులు ఎదర్కోవాల్సి వస్తున్నాయో ఈ మధ్య చూస్తున్నాం.
అన్నీ కలిసొచ్చి.. అనుకున్న డేట్‌కే రిలీజ్ అయితే నో ప్రాబ్లమ్. కానీ, అనుకోని కారణాలతో రిలీజ్ వాయిదా పడడం.. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవడం..కారణాలేమైనా కావచ్చు.. ఈ తరహా పరిస్థితుల్ని తట్టుకోవడానికి సిద్ధంగా వుండాల్సిందే.
అయితే, అక్కడున్నది మెగాస్టార్ చిరంజీవి. అలాగే డైరెక్టర్ వైపు నుంచి కూడా ఒకింత పాజిటివ్ సైనే కనిపిస్తోంది. కోవిడ్ అననుకూల పరిస్థితుల్లో ‘బింబిసార’ స్టార్ట్ చేసి పూర్తి చేసిన వశిష్టనీ తక్కువ అంచనా వేయడానికి లేదు. చూడాలి మరి.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు