నేలపై పడుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!

- January 31, 2024 , by Maagulf
నేలపై పడుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!

నేలపై నిద్రించడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు అందరూ నేలపైనే నిద్రించేవారు.
కానీ, ఇప్పుడు మారిన జీవన శైలి ప్రకారం నేల పైన నిద్రించడం తగ్గిపోయింది. కానీ, నేలపై నిద్రించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. షాకవుతారు.
ముఖ్యంగా ఊబకాయం సమస్యకు నేలపై నిద్రించడం చక్కని పరిష్కారంగా నిపుణులు చెబుతున్నారు. కారణమేంటంటే, నేలపై నిద్రపోవడం వల్ల శరీరం బరువు సమానంగా వుంటుంది.
రక్త ప్రసరణ శరీరానికి సక్రమంగా జరుగుతుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. బెడ్‌పై పడుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. తద్వారా రక్త ప్రసరణలోనూ మార్పులు వస్తాయ్.
దాంతో, శరీరానికి ఆరోగ్య పరంగా అనేక సమస్యలు తలెత్తుతాయ్. అంతేకాదు, వెన్నెముక నేలపై నిద్రించే అలవాటున్న వాళ్లలో సవ్యంగా వుంటుంది.
అయితే, ఆల్రెడీ వెన్నునొప్పి వున్నవాళ్లు డాక్టర్ సలహా మేరకే నేలపై నిద్రించే సాహసం చేయాలి. కొన్ని రకాల వెన్నునొప్పులకు ఖచ్చితంగా నేలపై నిద్రనే ప్రిఫర్ చేస్తారు. ఎన్ని మందులు వాడినా నేలపై నిద్ర ఆయా వెన్నునొప్పులకు అసలు సిసలు మందుగా తాజా సర్వేలో తేలింది.
అయితే, గర్భిణీ స్త్రీలు మాత్రం నేలపై పడుకోవడానికి కొన్ని షరతులు వర్తిస్తాయ్. ఖచ్చితంగా వైద్యుని సలహా వుండాల్సిందే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com