నకిలీ పాస్‌పోర్ట్ స్కామ్‌లో 14 మంది అరెస్ట్
- February 01, 2024
హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్ట్ స్కామ్‌లో ఇప్పటి వరకు 14 మందిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఇటీవల నిజామాబాద్‌కు చెందిన ఎస్‌బీ ఏఎస్‌ఐ లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసిన అధికారులు తాజాగా ఆదిలాబాద్‌లోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో పోస్టల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ప్రణబ్‌ను అరెస్ట్ చేశారు. నకిలీ పాస్‌పోర్టు వ్యవహారంతో సంబంధం ఉన్న వారి కోసం దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. నకిలీ డాక్యుమెంట్లతో ఇప్పటి వరకు శ్రీలంకకు చెందిన 65 మందికి పాస్‌పోర్ట్ జారీ చేసినట్లు గుర్తించారు. వీరంతా అక్రమంగా వలసలు వచ్చిన వారిగా తేల్చారు. వీటికి సంబంధించిన వివరాలను పాస్‌పోర్టు, ఇమిగ్రేషన్ అధికారులకు సీఐడీ అందజేసింది.కాగా, రాష్ట్రంలో సంచలనం సఅష్టించిన నకిలీ పాస్‌పోర్టు కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నకిలీ ధ్రువపత్రాలతో పాస్‌పోర్టు తయారీ కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని మక్లూర్, నవీపేట్ స్పెషల్ బ్రాంచ్ ఇన్‌చార్జీగా ఉన్న ఏఎస్‌ఐ లక్ష్మణ్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తదుపురి విచారణ కోసం లక్ష్మణ్‌ను హైదరాబాద్‌కు తరలించారు. ఇదే కేసులో భీంగల్ ఏజెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







