ప్రపంచ కనెక్టివిటీలో ఖతార్ ఏవీయేషన్ కీలక పాత్ర!

- February 04, 2024 , by Maagulf
ప్రపంచ కనెక్టివిటీలో ఖతార్ ఏవీయేషన్ కీలక పాత్ర!

దోహా: ఐక్యరాజ్యసమితి 2030 సస్టైనబుల్ ఎజెండా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంతో పాటు ప్రపంచ కనెక్టివిటీ, ఆర్థిక వృద్ధికి ఖతార్ పౌర విమానయాన పరిశ్రమ కీలక పాత్రను పోషిస్తుందని అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) కు ఖతార్ శాశ్వత ప్రతినిధి ఎస్సా అబ్దుల్లా అల్ మల్కీ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన  ఓ కార్యక్రమంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పౌర విమానయాన రంగంలో అనేక మైలురాళ్లను సాధించామని తెలిపారు. ఈ ప్రాంతంలో మరియు ప్రపంచవ్యాప్తంగా విమానయానంపై సానుకూల ప్రభావం చూపేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ రంగంలో సురక్షితమైన మరియు స్థిరమైన అభివృద్ధికి వ్యూహాత్మక లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు. తోటి ICAO సభ్య దేశాలకు అన్ని రకాల సహాయాన్ని అందించడంలో ఖతార్ ముందంజలో ఉందని అల్ మల్కీ వెల్లడించారు.   పర్యావరణ అనుకూలమైన పౌర విమానయానం కోసం విధాన రూపకల్పన, న్యాయవాదంలో ఖతార్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.  ICAO కొత్త క్రాస్-కటింగ్ ట్రాన్స్ఫర్మేషనల్ లక్ష్యాలకు ఖతార్ గట్టిగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com