‘విశ్వంభరుడి’కి జోడీ దొరికిందోచ్.!
- February 05, 2024
మెగాస్టార్ చిరంజీవి 156 వ చిత్రంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ సినిమాలో చిరంజీవి చాలా కొత్తగా కనిపించబోతున్నారని డైరెక్టర్ వశిష్ట ముందు నుంచీ చెప్పుకొస్తున్నాడు.
అందుకు తగ్గట్లుగానే రీసెంట్గా చిరంజీవి వర్కవుట్స్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘విశ్వంభర’ రెండో షెడ్యూల్‌కి సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో ‘విశ్వంభర’ హీరోయిన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
త్రిషకు హార్ట్లీ వెల్కమ్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. గతంలో ‘స్టాలిన్’ సినిమా కోసం ఈ ఇద్దరూ జోడీ కట్టిన సంగతి తెలిసిందే.
మళ్లీ 18 ఏళ్ల తర్వాత ఈ జోడీ ప్రేక్షకులకు కనువిందు చేయబోతోంది. అన్నట్లు ‘ఆచార్య’లోనే త్రిష నటించాల్సి వుంది. కానీ, లాస్ట్ మినిట్‌లో కాజల్ వచ్చి చేరడం.. ఆమె పాత్ర కూడా తీసేయడం జరిగింది.
అయితే, ‘విశ్వంభర’లో త్రిష మెయిన్ లీడ్ హీరోయిన్ కాగా, మరో ముగ్గురు హీరోయిన్లు కూడా నటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్‌లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









