‘కల్కి’ రెండు కాదు మూడు.!

- February 05, 2024 , by Maagulf
‘కల్కి’ రెండు కాదు మూడు.!

యూనివర్సల్ స్టార్ ప్రబాస్ సినిమా అంటేనే అంచనాలు ఆకాశాన్నంటేస్తున్నాయ్. కానీ సినిమాలు రిలీజయ్యాకా వాటికి అంత సీనూ సినిమా లేదు.. ప్రబాస్ ఇకపై సినిమాలు చేయడం కష్టమేనేమో.. ఈ తరహా అనుమానాలూ.. అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయ్.
అయినా, ప్రబాస్ సినిమాలకు ఏ మాత్రం క్రేజ్ తగ్గనే తగ్గడం లేదు. ‘సలార్’ సినిమాలో నిజానికి ప్రబాస్ చేసిందేమీ లేదు. అయినా కానీ, కటౌట్ వున్నోడికి కంటెంట్‌తో పని లేదు.. అన్నట్లుగా ఆ సినిమా కొట్టుకెళ్లిపోయింది.
ఇదే ఉత్సాహంలో ప్రబాస్ అభిమానులున్నారు ప్రస్తుతం. ఈ నేపథ్యంలోనే ప్రబాస్ తదుపరి సినిమాలపైనా భారీగా ఆశలు పెట్టేసుకున్నారు. ప్రబాస్ ప్రస్తుతం రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు లైన్‌లో పెట్టి వుంచారు.
అందులో ఒకటి ‘కల్కి 2898 ఏడీ’ సినిమా. ఈ సినిమా కోసం బాలీవుడ్ దిగ్గజ నటులు భాగమవుతున్నారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ తదితర బాలీవుడ్ నటీ నటులు ఈ సినిమాలో భాగమైన సంగతి తెలిసిందే.
అలాగే విశ్వనటుడు కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్‌గా పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఇంత భారీ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కిస్తారని భావిస్తున్నారంతా. కాదు కాదు, రెండు పార్టులు కాదు.. మూడు పార్టులుగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నామని తాజాగా చిత్ర యూనిట్ నుంచి అందుతోన్న సమాచారం.
ఈ ప్రచారంతో ప్రబాస్ ప్యాన్స్‌లో మరింత ఉత్కంఠ మొదలైంది. చూడాలి మరి, ఈ ఉత్కంఠను సెలబ్రేషన్‌లా ఫీలవ్వాలని ప్యాన్స్ భావిస్తున్నారు. ప్రబాస్ ఏం చేయబోతున్నాడో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com